తెలంగాణ జాగృతి తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న “కేసీఆర్ కప్ 2021” వాలీబాల్ టోర్నమెంట్ నేడు ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మ దినం సంధర్భంగా జరిగే ఈ టొర్నమెంట్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో జరిగే ఈ టోర్నమెంట్ లో 880 టీంలు పాల్గొంటున్నాయి.
ఇందులో భాగంగా జిల్లాలలో గెలుపొందే ప్రథమ జట్టుకు జిల్లా కప్‌తో పాటు 20,000 నగదు బహుమతి ఉంటుంది. అలాగే ద్వితీయ జట్టుకు కప్‌తో పాటు 10,000 నగదు బహుమతి ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో గెలిచే ప్రథమ జట్టు హైదరాబాద్‌లో జరిగే ఫైనల్ లీగ్ మ్యాచెస్‌లో పాల్గొంటుంది. ఫైనల్స్‌లో గెలుపొందే రాష్ట్ర స్థాయి విజేతకు కేసీఆర్ కప్ 2021 ట్రోఫీతో పాటు రూ.ల 100,000 నగదు బహుమతిగా ఉంది. రాష్ట్ర స్థాయి ద్వితీయ జట్టుకు ట్రోఫీతో పాటు రూ.ల 75,000 నగదు బహుమతి ఉంటుంది. క్రీడల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఇవాళ నిర్మల్‌లో ప్రారంభమైన జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడోత్సవాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మహబూబ్ నగర్‌లో ప్రారంభమైన టోర్నమెంటును యువజన క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. కామారెడ్డిలో జరిగిన క్రీడలను కలెక్టర్ శరత్‌లో ప్రారంభించారు. అలాగే వివిధ జిల్లాల్లో జరిగిన వాలీబాల్ క్రీడోత్సవాల ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, మెతుకు ఆనంద్, కృష్ణ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఆదిలాబాద్ మేయర్ జోగు ప్రేమేందర్, నిజామాబాద్ మేయర్ దండు నీతు కిరణ్, మంచిర్యాల చైర్మన్ పెంట రాజయ్య, గద్వాల చైర్మెన్ బి.ఎస్ కేశవ్ తదితరులు పాల్గొని క్రీడలను ప్రారంభించారు.
ఫైనల్ లీగ్ మ్యాచ్ లు: – ఫిబ్రవరి 14 నుండి 16 వరకు ఎల్.బీ స్టేడియం, హైదరాబాద్‌లో వివిధ జిల్లాలలో జిల్లా స్థాయి వాలీబాల్ మ్యాచ్ లు ఇలా జరుగుతాయి.
1) హైదరాబాద్ జిల్లా – ఫిబ్రవరి 9, 10 తేదీలలో, ఎల్.బీ స్టేడియం, హైదరాబాద్ – 20 టీమ్ లు.
2) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా – ఫిబ్రవరి 9, 10 తేదీలలో మేడిపెల్లి, బోడుప్పల్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా – 20 టీమ్ లు
3) వికారాబాద్ జిల్లా – ఫిబ్రవరి 9,10, 11 తేదీలలో, బాలుర ఉన్నత పాఠశాల, వికారాబాద్ – 40 టీమ్ లు.
4) రంగారెడ్డి జిల్లా – ఫిబ్రవరి 8,9 తేదీలలో, సరూర్ నగర్ స్టేడియం, రంగారెడ్డి జిల్లా – 16 టీమ్ లు.
5) మెదక్ జిల్లా – ఫిబ్రవరి 9, 10 తేదీలలో, గుల్షన్ క్లబ్, మెదక్ – 30 టీమ్ లు
6) సంగారెడ్డి జిల్లా – ఫిబ్రవరి 8, 9 తేదీలలో, దౌల్తాబాద్, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లా. – 36 టీమ్ లు.
7) సిద్దిపేట జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, డిగ్రీ కాలేజ్, సిద్దిపేట – 22 టీమ్ లు
8) కరీంనగర్ జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, ఎస్.ఆర్.అర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, కరీంనగర్ – 25 టీమ్ లు.
9) జగిత్యాల జిల్లా – ఫిబ్రవరి 9, 10 తేదీలలో, భూపతిపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – 30 టీమ్ లు.
10) రాజన్న సిరిసిల్ల జిల్లా – ఫిబ్రవరి 9, జూనియర్ కాలేజీ మైదానం, సిరిసిల్ల. – 33 టీమ్ లు.
11) పెద్దపల్లి జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, ఇండియన్ పబ్లిక్ స్కూల్, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా – 25 టీమ్ లు.
12) ఖమ్మం జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, సర్దార్ పటేల్ స్టేడియం, ఖమ్మం. – 25 టీమ్ లు.
13) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఫిబ్రవరి 9, 10 తేదీలలో, ప్రకాశం స్టేడియం, కొత్తగుడేం. – 18 టీమ్ లు.
14) మహబూబ్ నగర్ జిల్లా – ఫిబ్రవరి 9, 10 తేదీలలో, స్టేడియం గ్రౌండ్, మహబూబ్ నగర్ – 26 టీమ్ లు.
15) జోగులాంబ గద్వాల జిల్లా – ఫిబ్రవరి 9, 10 తేదీలలో, ఇండోర్ స్టేడియం, గద్వాల. – 30 టీమ్ లు.
16) వనపర్తి జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, జూనియర్ కాలేజ్ గ్రౌండ్, వనపర్తి. – 24 టీమ్ లు.
17) నారాయణ్ పేట్ జిల్లా – ఫిబ్రవరి 9, 10 తేదీలలో, కాకతీయ స్కూల్ గ్రౌండ్, నారాయణ్ పేట్. – 20 టీమ్ లు.
18) నాగర్ కర్నూల్ జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, జూనియర్ కాలేజ్ గ్రౌండ్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా. – 25 టీమ్ లు.
19) వరంగల్ అర్బన్ జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, కత్తికోట మైదానం, ఖిలా వరంగల్ – 22 టీమ్ లు.
20) వరంగల్ రూరల్ జిల్లా – ఫిబ్రవరి 11, 12 తేదీలలో, జే.ఎన్.ఎస్ గ్రౌండ్, హన్మకొండ – 25 టీమ్ లు.
21) జనగాం జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, ధర్మకంచ మినీ స్టేడియం, జనగాం – 28 టీమ్ లు.
22) మహబూబాబాద్ జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, ఎన్.టీఆర్ స్టేడియం, మహబూబాబాద్- 35 టీమ్ లు.
23) ములుగు జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, జూనియర్ కాలేజ్ గ్రౌండ్, ములుగు – 35 టీమ్ లు.
24) భూపాలపల్లి జిల్లా – ఫిబ్రవరి 10, 11 తేదీలలో, బీ.ఆర్ అంబేద్కర్ స్టేడియం, భూపాలపల్లి – 28 టీమ్ లు.
25) నల్గొండ జిల్లా – ఫిబ్రవరి 11, 12 తేదీలలో, ఎన్ జీ కాలేజ్, నల్గొండ. – 25 టీమ్ లు.
26) యాదాద్రి భువనగిరి జిల్లా – ఫిబ్రవరి 09- 11 తేదీలలో, ప్రభుత్వ కాలేజ్ గ్రౌండ్, భువనగిరి. – 26 టీమ్ లు.
27) సూర్యాపేట జిల్లా – ఫిబ్రవరి 11, 12 తేదీలలో, జూనియర్ కాలేజ్ గ్రౌండ్, సూర్యాపేట. – 22 టీమ్ లు.
28) నిజామాబాద్ జిల్లా – ఫిబ్రవరి 09, 10 తేదీలలో, కలెక్టర్ గ్రౌండ్, నిజామాబాద్. – 40 టీమ్ లు.
29) కామారెడ్డి జిల్లా – ఫిబ్రవరి 09, 10 తేదీలలో, సరస్వతి శిశు మందిర్, కామారెడ్డి. – 46 టీమ్ లు.
30) ఆదిలాబాద్ జిల్లా – ఫిబ్రవరి 09, 10 తేదీలలో, ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, ఆదిలాబాద్ – 21 టీమ్ లు.
31) నిర్మల్ జిల్లా – ఫిబ్రవరి 09, 10, 11 తేదీలలో, జూనియర్ కాలేజ్ స్టేడియం, నిర్మల్ – 22 టీమ్ లు.
32) మంచిర్యాల జిల్లా – ఫిబ్రవరి 09, 10 తేదీలలో, బాలుర హైస్కూల్ గ్రౌండ్, మంచిర్యాల – 28 టీమ్ లు.
33) కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా – ఫిబ్రవరి 09, 10 తేదీలలో, సర్ సిల్క్ పార్క్ లైన్ గ్రౌండ్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ జిల్లా – 15 టీమ్ లు.