కాజల్‌కు ఐదేళ్ల వయసు నుండే ఆ వ్యాధి ఉందట..!

262
Kajal Aggarwal
- Advertisement -

టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు.. పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక విషయం గురించి వెల్లడించి అభిమానులను కాజల్ షాక్ కు గురి చేసింది. ఐదేళ్ల వయసు నుంచి తాను బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నానని కాజల్ చెప్పింది.

శీతాకాలంలో వ్యాధి మరింత ఎక్కువవుతుందని… ఈ వ్యాధి వల్ల తాను చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. ఆస్తమా వల్ల ఆహారం విషయంలో కూడా తాను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పింది. ఆస్తమా నుంచి బయటపడేందుకు తాను ఇన్ హేలర్ వాడతానని కాజల్ తెలిపింది. ఇన్ హేలర్ వాడటం వల్ల కాస్త రిలీఫ్ లభించిందని చెప్పింది. అయితే ఇన్ హేలర్ వాడేందుకు చాలా మంది సిగ్గు పడుతుంటారని… ఎవరో ఏదో అనుకుంటారని భావించకూడదని, ఇన్ హేలర్ లు ఉపయోగించాలని సూచించింది.

- Advertisement -