తెలంగాణను ఆగమాగం కానివ్వను : సీఎం కేసీఆర్‌

24
kcr
- Advertisement -

నా బ‌లగం ప్ర‌జ‌లని సీఎం కేసీఆర్‌ అన్నారు. నా బొందిలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానివ్వ‌ను. ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు స‌ర్వ‌శ‌క్తుల‌ను ధార‌పోస్తాను. మీ అండ‌దండ‌లు, ఆశీర్వ‌చ‌నం ఉన్నంత వ‌ర‌కు త‌న‌కేం కాద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఇవాళ రంగారెడ్డి జిల్లా తెలంగాణ‌కే బంగారు కొండ‌గా మారింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. ఎక‌రం భూమి ఉన్న వ్య‌క్తి కూడా పెద్ద కోటీశ్వ‌రుడు. ఈ మ‌త పిచ్చిల ప‌డి దాన్ని చెడ‌గొట్టుకోవాలా. నీచ రాజ‌కీయాల కోసం రాష్ట్రాన్ని అల్ల‌క‌ల్లోలం చేస్తుంటే చూసి ఊరుకోవ‌ద్దు. ఓట్ల కోసం భార‌త సమాజంని గోస పెట్టే ప‌రిస్థితి తెస్తున్నారు. మోదీ ఆగంమాగవుతున్నారు. ఉన్న ప‌ద‌వి చాలాదా? అంత‌క‌న్న పెద్ద ప‌ద‌వి లేదు క‌దా..? మ‌న తెలంగాణ‌లో ఎలాంటి కారుకూత‌లు కూస్తున్నారో ఆలోచించాలి. తెలంగాణ స‌మాజాం ప్ర‌శాంతంగా ఉంది. అద్భుత‌మైన‌టువంటి ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అభివృద్ధి జ‌రుగుతుంది.

ఒక ఇల్లు కట్టాలంటే చాలా స‌మ‌యం ఏర్ప‌డుతుంది. రాష్ట్రం ఏర్ప‌డాలంటే చాలా సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ప్రాజెక్టు క‌ట్టాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది. మూఢ‌న‌మ్మ‌కాలు, పిచ్చితో, ఉన్మాదంతో వాట‌న్నింటిని రెండు మూడు రోజుల్లో కూల‌గొట్టొచ్చు. ఎంత క‌ష్ట‌మైత‌ది. 58 ఏండ్ల తెలంగాణ కోసం కొట్లాడం. తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

బెంగ‌ళూరు సిటీ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందింది. అక్క‌డి ప్ర‌భుత్వాలు చాలా క‌ష్ట‌ప‌డి ఒక వాతావ‌ర‌ణాన్ని నిర్మాణం చేశారు. 30 ల‌క్ష‌ల మందికి ఐటీలో ప్ర‌త్య‌క్షంగా ఉద్యోగాలు దొర‌కుతున్నాయి. ఈ సంవ‌త్స‌రం మ‌న కంటే త‌క్కువ ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రిగింది. తెలంగాణ ఒక ల‌క్షా 55 వేల ఉద్యోగాలు ఇచ్చింది. కానీ బెంగ‌ళూరులో ఈ ఏడాది ఏడెనిమిది వేల ఉద్యోగాలు త‌గ్గిపోయాయి. అక్క‌డ వాతావ‌ర‌ణాన్ని కలుషితం చేశారు. అలాంటి వాతావ‌ర‌ణం తెలంగాణ‌లో, హైద‌రాబాద్‌లో రావాలా? మ‌న పిల్ల‌ల‌కు ఉద్యోగాలు రాకుండా పోవాలా? ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఈ దుర్మార్గులు, చిల్ల‌ర‌గాళ్లు, మ‌త పిచ్చిగాళ్ల మాయ‌లో ప‌డొద్ద‌ని కేసీఆర్ సూచించారు.

- Advertisement -