దీపావళి తర్వాత కేసీఆర్‌ టూర్..!

224
trs
- Advertisement -

సీఎం కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనకు సర్వం సిద్దమైంది. దీపావళి తర్వాత కేసీఆర్ నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. గత రెండురోజులుగా పార్టీ ముఖ్య నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న ఆయన ప్రచార వ్యూహా లు, సభల నిర్వహణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండురోజుల్లో ఈ షెడ్యూల్‌ ఖరారుకానుంది. ఈ లోపు మహాకూటమి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉండటంతో అప్పుడే ప్రచారాన్ని ప్రారంభిస్తే బాగుంటుందని పార్టీ నేతలు కేసీఆర్‌కు సూచించారట.

ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులుంటేనే ఆయా నియోజకవర్గాల్లో పోటీపై స్పష్టత వస్తుందని…టీఆర్ఎస్ అభ్యర్థులతో పోలుస్తూ ప్రత్యర్థి పార్టీల వారిపై విమర్శలు చేయడానికి అవకాశం ఉంటుందని ,దీనికి అనుగుణంగా సీఎం సభలు జరిగితే లాభదాయకమని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.

KCR election campaign

ఏకపక్షం అనుకున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు ముగియనున్న నవంబర్‌ 19లోగా ప్రచారాన్ని నిర్వహించే యోచనలో ఉన్నారు కేసీఆర్. మంత్రులను కూడా త్వరగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించుకోవాలని, ఇతర నియోజకవర్గా లకు అందుబాటులోకి రావాలని సీఎం సూచిస్తున్నారు. మూడు దశలో సీఎం నియోజకవర్గాల పర్యటన ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఓ వైపు సీఎం కేసీఆర్ ప్రచారం…మరోవైపు మంత్రి కేటీఆర్ సైతం కార్యకర్తలు,నేతలతో భేటీలు జరపనున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలో సెటిలర్లను ఆకట్టుకునే బాధ్యతను భుజాన వేసుకున్న కేటీఆర్..24 నియోజకవర్గాల్లో కనీసం 15 స్థానాల్లో గెలిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -