ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు..

21
- Advertisement -

ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ఆద్వర్యం లో లండన్ లో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ,భారాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత, ఉద్యమ రథసారధి కెసిఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎన్నారై భారస మరియు ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు.

కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లపుడూ వారికి ఉండాలని ప్రార్థించారు.ఎన్నారై భారస కుటుంబ సభ్యులంతా కేక్ కట్ చేసి కెసిఆర్  70 వ జన్మదిన వేడుకల్ని జరుపుకొని హ్యాపీ బర్త్ డే కెసిఆర్ సార్ ….మేమంతా మీ వెంటే అంటూ నినదించారు.

ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు వారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామని ఎన్నారై బి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ ఖండాంతరాల్లో ఉంటూ భారస జెండా మోసే అవకాశం కలిపించిన కెసిఆర్ గారికి అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కవిత గారికి మరియు ఇతర నాయకులందరికీ చంద్రశేఖర్ గారు కృతఙ్ఞతలు తెలిపారు.

హాజరై కార్యక్రమాన్ని వియజవంతం చేసిన ఎన్నారై బి.ఆర్.యస్ నాయకులకు, కుటుంబసభ్యులకు, ఇతర సంస్థల ప్రతినిధులకు, ప్రవాసులకు ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లపుడూ అండగా ఉంటూ కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో పార్టీ పిలుపిచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై బి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ప్రధాన కార్యదర్శి మరియు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల,ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అడ్విసోరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సిక్కా, కార్యదర్శులు హరి గౌడ్ నవాబుపేట్ మరియు సత్యమూర్తి చిలుముల, కోశాధికారి సతీష్ గొట్టెముక్కుల, ఎన్నారై భారస నాయకులు మల్లా రెడ్డి, వీర ప్రవీణ్ కుమార్, రమేష్ ఎసెంపెల్లి,రవి రేతినేని, పృథ్వీ రావుల ప్రవాస సంఘాల నాయకులు జస్వంత్, శుష్మున రెడ్డి, క్రాంతి, పావని తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

Also Read:Vishal:ఎనిమిది కోట్లు వద్దన్న విశాల్

- Advertisement -