కృషి హోమ్స్‌లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు..

5
- Advertisement -

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి మల్లారెడ్డీతో కలిసి మేడ్చల్ మండలం గౌడవెళ్లి లోని కృషి హోమ్స్ మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ సందర్శించారు. కృషి హోమ్స్ కి వచ్చిన సంతోష్ కుమార్ కి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు..

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసారు.అనంతరం విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు.

 

కృషి హోమ్స్ లోని అనాథ విద్యార్థులకు తన వంతు సాయంగా సంతోష్ కుమార్ రెండు లక్షల వ్యక్తిగత సహాయం ప్రకటించారు.కృషి హోమ్స్ విచ్చేసి అనాథ విద్యార్థుల సహాయార్థం రెండు లక్షలు ప్రకటించిన సంతోష్ కుమార్ కి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read:ఆ రోజు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి : హరీశ్

- Advertisement -