కేసీఆర్ బర్త్ డే..సేవా కార్యక్రమాలకు పిలుపు

4
- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఈనెల 17న కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎవరికి తోచినవిధంగా ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:దీపాదాస్‌పై తప్పుడు ప్రచారం సరికాదు!

- Advertisement -