- Advertisement -
హైదరాబద్ పాస్ పోర్టు ఆఫీస్‌కు వచ్చారు మాజీ సీఎం కేసీఆర్. సాదారణ పాస్ పోర్టు తీసుకోవడానికి వచ్చారు కేసీఆర్. సీఎం హోదా డిప్లమాటిక్ పాస్ పోర్టును 2016లో తీసుకున్నారు కేసీఆర్. సీఎం హోదాలో చైనా, సింగపూర్, మలేసియా దేశాల్లో పర్యటించింది కేసీఆర్ బృందం.
ఇప్పుడు సీఎం హోదాలో లేకపోవడంతో సాదారణ పాస్ పోర్ట్ తీసుకోనున్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన కేసీఆర్ పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు. పాస్ పోర్ట్ ఆఫీసు నుంచి నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు కేసీఆర్.
అనంతరం అక్కడి నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అనంతరం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు కేసీఆర్.
Also Read:జీబీఎస్ అంటువ్యాధి కాదు..!
- Advertisement -