సీఎం కేసీఆర్‌ ఏపీ టూర్‌ రద్దు..

75
kcr

సీఎం కేసీఆర్ విశాఖ పర్యటన రద్దైంది. ఈ నెల 14న కేసీఆర్ విశాఖలో శారద పీఠం వార్షికోత్సవాలతో పాటు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కొత్త ఇళ్లు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం సీఎం ఏపీ టూర్‌ను కన్ఫామ్‌ చేశారు. అయితే అనూహ్యంగా కేసీఆర్ తన విశాఖ టూర్‌ని రద్దుచేసుకున్నారు.

ఓ వైపు బడ్జెట్ రూపకల్పన,మంత్రివర్గ విస్తరణ సన్నాహాలు,18 నుండి మూడు రోజుల కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో విశాఖ టూర్‌ను రద్దుచేసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్ర పర్యటన నేపథ్యంలో సీఎంతో అధికారుల భేటీ,క్షేత్రస్థాయి పర్యటనలు ఉండనున్నాయి.ఆర్థిక సంఘానికి ఇవ్వాల్సిన నివేదిక తయారీతోపాటు రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించే అంశంపై ఉన్నతాధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించనున్నారు.

దీనికి తోడు మంత్రివర్గ విస్తరణపై ఇవాళ కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. ఇక కేసీఆర్ స్థానంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విశాఖ వెళ్లనున్నారు. ఇక ఈ నెల 17న కేసీఆర్ బర్త్ డే ఉండటం తర్వాత మూడు రోజుల పాటు ఆర్థిక సంఘం పర్యటన ఉండటంతో బిజీ షెడ్యూల్‌లో తన టూర్‌ని రద్దుచేసుకున్నారు సీఎం.