కెరళకు..తెలంగాణ ఆపన్న హస్తం

239
- Advertisement -

కెరళ రాష్ర్టానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25 కోట్ల తక్షణ సహాయాన్ని ప్రకటించారు. ఈ నిధులను కెరళ రాష్ట్రానికి అందజేయాలని శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీని సీఎం ఆదేశించారు. భారీ వర్షాలతో, వరదలతో కెరళ రాష్ట్రం అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరదల వల్ల కెరళలో నీరు కలుషితమైందని, ఆ నీటిని శుద్దిచేసేందుకు రూ.25 కోట్ల విలువైన ఆర్వో మిషన్లను పంపాలని కేసీఆర్‌ అధికారులకు స్సష్టం చేశారు.

 flood-hit Kerala

అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించే విరాళాలను తక్షణమే కెరళకు పంపే ఏర్పాట్లు చేసినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కెరళలో ప్రాణ, ఆస్తి నష్టం జరగడంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిని ఆయన…కెరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కెరళకు అవసరమైన సహాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వ ఎప్పుడూ సిద్దంగానే ఉంటందని ప్రకటించారు.

Keralaకాగా.. ఇబ్బందుల్లో ఉన్న కెరళకు తెలంగాణలోని పారిశ్రామిక వేత్తలు, ఐటీ రంగ ప్రముఖులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, ఇతర రంగాల వారు కేరళకు ఇతోధిక సాయం అందించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -