ఎట్టీ పరిస్ధితుల్లో ఆర్టీసీ విలీనం కుదరదుః సీఎం కేసీఆర్

488
cm kcr
- Advertisement -

ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ధృవీకరించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగినట్లు సీఎం తెలిపారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో చాలా పటిష్టంగా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అనేక నిర్ణయాలు మంచి ఫలితాలనిచ్చాయి. తద్వారా అతి తీవ్రమైనటువంటి ఆర్ధికమాంద్యం దేశం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం కూడా దెబ్బతింటున్నది. కానీ నెగిటివ్ గా పోతలేదు. రాష్ట్ర వృద్ది రేటు 21 శాతం నుంచి 5శాతానికి తగ్గింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదు. ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు. క్యాబినెట్ మీటింగ్ లో ఈనిర్ణయం తీసుకున్నాం. అంతులేని కోరికలతో కార్మికులు సమ్మెకు వెళ్లారు. కార్మీకులు అనాలోచితంగా సమ్మెకు వెళ్లారు.

అదేవిధంగా 5100 ప్రైవేటు రూట్లలో బస్సులకు అనుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ నడుపుతున్న బస్సులు 10400 ఇందులో 2100బస్సులు అల్రెడీ ప్రైవేటు వాళ్లు అద్దెకు తీసుకున్నవే ఉన్నాయి. మిగిలిన 8300బస్సులలో 2609బస్సులు ఆల్రెడీ కరాబ్ అయినయి. వాస్తవానికి వాటిని నడుపవద్దు. ఆర్టీసీ వారు కొత్త బస్సులను కొనగలిగే పరిస్ధితుల్లో లేరు కాబట్టి ప్రైవేలు రూట్లకు అనుమతులు ఇచ్చాం. సమ్మెకు వెళ్లవద్దు అని చెప్పినా వెళ్లారు. ప్రభుత్వం కమిటి నియమించింది. కమిటి ద్వారా చర్చలు జరపమన్నాం. సమ్మె అక్రమం అని డిక్లెర్ అయింది. కార్మిక సంఘాలు ప్రతిపక్షాల మాటలు విని ఇంకో 10రోజులు ఏదో కార్యచరణను ప్రకటించినయి. సమ్మె అక్రమం కాబట్టి ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగికి సంబంధాలు కట్ అయినయి. ఇది కార్మికుల మనుగడను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సమ్మె కాదు. పనికి మాలిన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు. మొత్తం ప్రైవేట్ కు ఇవ్వం. ఆర్టీసీ ఉండాలి.

ఇటివలే కేంద్ర ప్రభుత్వం 2019మోటార్ వెహికిల్ చట్టం తెచ్చింది. ఈ చట్టంలో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సంపూర్ణమైనటువంటి అధికారం ఇచ్చింది. ప్రైవేట్ రూట్ పర్మిట్లు ఎన్నైనా ఇవ్వవచ్చు మంచి సెప్టీ ప్రయాణికులకు రావాలి అని చెప్పింది. ఆ రకంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్మికులు 49వేల మంది ఉన్నరు.. వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి. వారి పట్ల తమ ప్రభుత్వం అంత కఠినంగా లేదు. మేము చిన్న ఉద్యోగులను చాలా రకాలుగా ఆదుకున్నం. మేము కార్మికులకు ఎంత పెంచినమో ఒక చరిత్ర ఉంది. ఇదే ఆర్టీసీ కార్మికులకు కూడా గతంలో ఏ ప్రభుత్వం కూడా 4సంవత్సరాల కాలంలో 67శాతం జీతాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.

అదే విధంగా 4760మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యూలరైజ్ కూడా చేశాం. ప్రజల కడుపులు నింపినం, కార్మికుల కడుపులు నింపినం తప్ప మా ప్రభుత్వం ఎవరి పోట్ట కొట్టలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 58.3శాతం జీతం పెంచినం. ఇట్ల 23శాఖల ఉద్యోగులకు జీతాలు పెంచినం. టీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్ వాడిలకు కావచ్చు,, హోంగార్డులకు కావచ్చు, పోలీస్ డిపార్ట్ మెంట్ కు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరికి కూడా గౌరవ ప్రదంగా బ్రతకాలని చేశామే తప్ప ఎవ్వరి పొట్ట కొట్టలేదు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు నివారించగలిగినాం. రైతుల బాధలు తీర్చినం. ఇవన్ని కూడా ప్రభుత్వం అవలంబించిన మంచి నిర్ణయాల వల్ల జరిగినయి. 49వేల మంది ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టే ఉద్దేశం మాకు లేదు. వాళ్లు రోడ్డు పడాలే అని మేము కోరకొం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే అని మేం భావిస్తాఉన్నాం. యూనియన్ల మాయలో పడి ఆర్మికులు జీవితాలు పాడు చేసుకోవద్దు. మీ సోదరుడిగా, ముఖ్యమంత్రిగా చెబుతున్నా ఆర్టీసీ కార్మికులకు నవంబర్ 5వరకు ఒక అవకాశం ఇస్తున్నాం. 6వ తేది నుంచి కార్మికులు బేషరతుగా డ్యూటీలో చేరవచ్చు.. లేదు మేము అట్లే చేస్తం అంటే దానికి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు.

- Advertisement -