రాజు గారు నాకేం సంబంధం లేదు..వర్మతో రాజమౌళి

320
Rgv Rajamouli
- Advertisement -

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా టైటిల్ ప్రకటించినప్పటి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇటివలే ఈసినిమా ట్రైలర్‌ ను విడుదల చేశారు వర్మ. కాగా తాజాగా ఆయన ఆ సినిమాలో కేఏ పాల్ పై తీసిన ఓ సాంగ్‌ను విడుదల చేశాడు. తాజాగా వర్మ కేఏ పాల్, దర్శకుడు రాజమౌళిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఇండియాలో జోకర్ మూవీ అంత పెద్ద విజయం సాధించిగా లేంది.., కేఏ పాల్‌పై వచ్చే బయోపిక్.. బహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. దీని కోసం రాజమౌళి వాషింగ్టన్‌లో పాల్‌తో చర్చించారని, ఇదే విషయం తనకు పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఈ ట్వీట్‌లో రాజమౌళిని ట్యాగ్ చేశారు. తాజాగా ఈట్వీట్ చూసిన రాజమౌళి స్పందించారు. నన్ను ఇందులోకి లాగకండి రాజు గారు అని ట్వీట్ చేశారు.

ఆ తర్వాత రాజమౌళి ట్వీట్ చూసి వర్మ కూడా రీ ట్వీట్ చేశారు. సార్ నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కాదు, ట్రంప్ టవర్స్ లో మీరిద్దరూ లంచ్ చేశారట, బాహుబలి-3కి మీరు కేఏ పాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. కేఏ పాల్ మీద ఒట్టు! తనే నాకు ఫోన్ చేసి చెప్పాడు” అంటూ రీ ట్వీట్ చేశాడు.

- Advertisement -