28న సీఎం కేసీఆర్ దత్తపుత్రిక వివాహం..

260
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ దత్తపుత్రికగా ప్రచారం అందుకున్న ప్రత్యూష వివాహం జరగనుంది. అప్పట్లో సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై సీఎం కేసీఆర్ ఔదార్యంతో చక్కని జీవితాన్ని పొందిన ప్రత్యూష ఇప్పుడు పెళ్లి కూతురు కాబోతుంది. ఈ నెల 28న ఆమె వివాహం చరణ్ రెడ్డితో ఓ చర్చిలో జరగనుంది.ఇదివరకే గత అక్టోబరులో చరణ్ తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.

హైదరాబాదులోని రాంనగర్ కు చెందిన మర్రెడ్డి, జైన్ మేరీ దంపతుల కుమారుడు చరణ్ రెడ్డితో ఆమె వివాహం నిశ్చయమైంది. ప్రత్యూష వివాహం రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లూర్దు మాత చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరగనుంది కాగా, వరుడు చరణ్ రెడ్డితో ఆమెకు బంధుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక ప్రత్యూష పెళ్లి ఏర్పాట్లను రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. ప్రత్యూష పెళ్లి నేపథ్యంలో రేపు బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రాంగణంలో ప్రధానం కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా సవతి తల్లి చెర నుంచి విడుదలైన ప్రత్యూష తర్వాత కాలంలో నర్సింగ్ విద్య అభ్యసించి ఉద్యోగం సంపాదించింది.

- Advertisement -