- Advertisement -
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు పెను ప్రమాదం తప్పింది. వేణుగోపాల్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.
వాతావరణం సహకరించకపోవడంతో త్రివేండ్రం నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని టేక్ ఆఫ్ అయిన కాసేపటికే చెన్నైకి దారి మళ్లించింది సిబ్బంది.
Also Read:దుల్కర్..’కాంత’ ఫస్ట్ సింగిల్
దాదాపు రెండు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టి చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ఇదే విమానంలో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ పార్టీ జెనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు.
- Advertisement -

