కర్ణాటక తొలి ముఖ్యమంత్రి.. కేసీ రెడ్డి

44
- Advertisement -

కర్ణాటక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీ రెడ్డి. 1902 మే4న కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జన్మించారు. ఆయన పూర్తి పేరు కె.చెంగలరాయ రెడ్డి. వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన కేసీ రెడ్డి..స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలను వ్యతిరేకంగా జరిగిన అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Also Read:బంగాళాఖాతంలో తుపాను..భారీ వర్ష సూచన

న్యాయశాస్త్రంలో పట్టా పొందిన కేసీ రెడ్డి.. 1930లో ప్రజా పక్ష (పీపుల్స్ పార్టీ)ని స్థాపించాడురు. ప్రధానంగా రైతుల సమస్యలను ఎత్తి చూపడంతో ఆ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మద్దతు లభించింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత “మైసూర్ చలో ” ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో 1947 అక్టోబరు 25న రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

Also Read:యుక్రెయిన్‌పై రష్యా మిస్సైల్స్‌ దాడి

1957, 1962 పార్లమెంటు ఎన్నికలలో కోలార్ పార్లమెంట్ స్థానం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర గృహనిర్మాణ, సరఫరా మంత్రిగా (1957-61) & వాణిజ్యం, పరిశ్రమల మంత్రిగా (1961-63) కూడా పనిచేశాడు.1965 నుండి 1971 వరకు మధ్యప్రదేశ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

- Advertisement -