ఎంపీ కవిత చేపట్టిన ‘సిస్టర్స్ 4చేంజ్’కు అన్నివర్గాల మద్దతు లభిస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రముఖులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ ఆమెను ప్రత్యేకంగా ట్వీట్‌లో అభినందించారు.సైనానేహ్వాల్, గుత్తా జ్వాల, మిథాలీరాజ్, అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్,ఎంపీ కవితకు తమ మద్దతు ను ట్వీట్ ద్వారా తెలిపారు.
బైక్ నడిపేటపుడు హెల్మెట్ పెట్టుకోవాలని, తమ సోదరులకు రాఖీ కట్టిన తర్వాత ప్రతి సోదరి కోరాలని.. అలాగే సోదరులకు హెల్మెట్ బహూకరించాలన్న ఉద్దేశంతో ‘సిస్టర్స్4చేంజ్’ పేరిట కవిత వినూత్న కార్యక్రమం చేపట్టారు.
బుధవారం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లో ఉన్న అవినాశ్ కాలేజ్ విద్యార్థులు ‘సిస్టర్స్4చేంజ్’ కార్యక్రమంను వినూత్నమైన రీతిలో నిర్వహించారు.ఎంపి కవిత మాస్క్ లు ధరించిన స్టూడెంట్స్ ‘వి సపోర్ట్ కవితక్క’ అంటూ నినదించారు.ఈ రాఖీ పండుగకు తమ సోదరులు కు రాఖీ కట్టి హెల్మెట్ ని బహుమతి గా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు .ఈ అవగాహన ర్యాలీలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.