బిగ్ బాస్‌ షో: దీక్షకు కిస్ ఇచ్చేశాడు…

248
Prince kisses To Diksha
- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటివరకు ఏ షో సాధించని విధంగా టీఆర్పీ రేటింగ్‌ సాధించి ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు 16 ఎపిసోడ్స్‌లో పెద్దగా హంగామా లేకపోయిన 17వ ఎపిసోడ్ నుంచి అసలు మజా మొదలైంది. 17వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్ సభ్యులు వివాదాలతో హీట్ పెంచగా 18వ ఎపిసోడ్‌ మాత్రం రొమాంటిక్ ఫీల్‌లో సాగింది.

హౌస్‌లో అందరూ పెళ్లయిన అమ్మాయిలే ఉన్నారని… వారిని చూస్తే బోర్ కొడుతోందని తనకు సరిపోయే పెళ్లికాని అమ్మాయిలెవరినైనా హౌస్‌లోకి తీసుకొస్తే బాగుంటుందని హీరో ప్రిన్స్ సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో  వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్‌ షో గ్లామర్ లుక్‌ ఇచ్చిన దీక్షపై ఫుల్ ఫోకస్ పెట్టాడు ప్రిన్స్. ఒకవైపు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా దీక్షకు తగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.

బిగ్ బాస్ హౌస్‌లోని కుటుంబ సభ్యుల కోసం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ‘ఒప్పో పైసా వసూల్’ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో వసూలుదారులపై వినియోగదారులు గెలిపొందారు. లగ్జరీ బడ్జెట్‌లో గెలుపొందిన వినియోగదారుల గ్రూపులోనే ప్రిన్స్, దీక్ష ఉండటంతో ఆ అమౌంట్‌ని పంచుకునే నేపధ్యంలో దీక్షకు తక్కువ అమౌంట్‌ని కేటాయించడం ఆమె తిరిగి అడగడంతో సారీ  అని చెప్పుతూనే.. దీక్షను ముద్దాడేశాడు ప్రిన్స్.

ఏం చేస్తున్నావ్ ప్రిన్స్ అని షాక్ తిన్న దీక్ష అడగడంతో పక్కనే కదా ముద్దు పెడతా అంటూ కామెడీగా కవర్ చేసేశాడు ప్రిన్స్. మొత్తానికి ప్రిన్స్  ‘దీక్ష’ పట్టుదలతోటే గేమ్ ఆడుతున్నట్టు  కనిపిస్తోందని మిగితా సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు.

https://youtu.be/v5tEiggJJ-M

- Advertisement -