- Advertisement -
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై పంచ్ వేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ట్విట్టర్ ట్వీట్ చేసిన కవిత.. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.
ఇది ఇలా ఉండగా ప్రగతిభవన్ ముట్టడి పేరుతో వైఎస్ షర్మిల హంగామా చేసిన విషయం తెలిసిందే. షర్మిలను కారులో దిగాలని పోలీసులు సూచిస్తున్నా ఆగకుండా పోలీసులపై దూసుకెళ్లారు. దీనిని రికార్డు చేస్తున్న మహిళా ఎస్సై చేతిలో నుంచి సెల్‌ఫోన్‌ను కూడా లాగేశారు.
ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, ప్రజలు ఇబ్బందులకు గురవుతుండటంతో, ట్రాఫిక్ క్రేన్‌ను రప్పించి, డ్రైవింగ్ సీట్లో ఆమె కూర్చొని ఉండగానే కారును టోయింగ్ చేస్తూ ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇక తర్వాత షర్మిల కోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన అనుమతినిచ్చింది న్యాయస్థానం.
ఇవి కూడా చదవండి..
- Advertisement -