బసవేశ్వరుడి ఆలోచనలు నేటికి ఆదర్శం: మాజీ ఎంపీ కవిత

320
kavitha k
- Advertisement -

బసవేశ్వరుడి ఆలోచనలు నేటికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు మాజీ ఎంపీ కవిత. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించిన కవిత.. మనుషులంతా ఒక్కటే,ప్రజాస్వామ్య విలువలు,ఆదర్శ భావాలు ఇప్పటికి- ఎప్పటికి ఆచరణీయమని కొనియాడిన ఆమె..బసవన్న జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అని ట్విట్‌లో పేర్కొన్నారు.

సంఘ సంస్కర్తగా, మహాకవిగా, మహాభక్తునిగా సమాజ శ్రేయస్సే పరమావధిగా భావించిన దార్శనికుడు బసవేశ్వరుడు. క్రీ.శ.1131లో బీజాపూర్ జిల్లా నందలి ఇంగులేశ్వర్ బాగేవాడి నందు సుప్రసిద్ధ శైవ బ్రాహ్మణ కుటుంబములో నందీశ్వర భక్తులైన మాదరస, మాదలాంబిక దంపతులకు జన్మించాడు. బసవేశ్వరుని దృఢ సంకల్పము, పరమ శివభక్తి, త్యాగశీలత, కుల వివక్షపై పోరాటంతో ప్రజలకు పలు సూచనలు చేశాడు.

kavitha

- Advertisement -