కవిత ప్రశ్నలకు.. సమాధానమెక్కడ ?

44
- Advertisement -

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీపై కేంద్ర ప్రభుత్వ కక్ష పూరిత రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత కాషాయ పార్టీ పాతాళానికి పడిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గ్రహించిన కమలనాథులు.. బి‌ఆర్‌ఎస్ ను నిలువరించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి పార్టీని కూల్చే ప్రయత్నం చేసిన కే‌సి‌ఆర్ చతురత ముందు కమలనాథుల పాచికలు పారలేదు. ఇక అసలు ఏ మాత్రం సంబంధం లేని డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఇరికించే ప్రయత్నం చేస్తున్న కేంద్ర పెద్దల కుయుక్తులు బెడిసి కొడుతున్నాయి. .

ఇప్పటికే పలు మార్లు కవితా కు నోటీసులు జారీ చేసిన ఈడీ నిరూపణ చేయడంలో ఘోరంగా విఫలం అయింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఎంత కక్ష పూరితంగా వ్యవహరిస్తునే విషయం. ఇక తాజాగా మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది ఈడీ. అయితే మోడీ గుప్పిట్లో ఉన్న ఈడీ కక్షపూరితంగా జారీ చేస్తున్న నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవితా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో కవితా సంధించిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా ? అంటే ముమ్మాటికి లేదనే చెప్పాలి. సాధారణంగా మహిళలను దర్యాప్తు సంస్థ కార్యాలయాలలో విచారణ చేయకూడదని సెక్షన్ 160 చెబుతోంది.

అంతేకాకుండా మహిళలను రాత్రి 8 తరువాత విచారణ చేయకూడదు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఈ రెండు నిబంధనలను అతిక్రమించింది. ఆ మద్య కవితాను తన స్వగ్రాహంలో కాకుండా ఈడీ ఆఫీస్ కు పిలిపించుకొని విచారించడమే కాకుండా రాత్రి 8 గంటలు దాటిన ఇంకా విచారణ కొనసాగించింది ఈడీ. అంటే రాజ్యాంగ నిబంధనలు మోడీ సర్కార్ లోని సంస్థలకు వర్తించవా ? ఈ వైఖరి కక్షపూరితం కాక మరెంటి ? అని ప్రతి సామాన్యుడు సైతం మోడీ సర్కార్ ను వేలెత్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి తమను ప్రశ్నించే అధికారం ఎవరికి లేదని ఒకవేళ ప్రశ్నిస్తే అక్రమ కేసులు ఎదుర్కోవాల్సిందేననే విధంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్ నియంత దొరణికి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పక తప్పదు.

Also Read:పవన్ పెద్ద ప్లానే.. అందుకే టీడీపీతో పొత్తు?

- Advertisement -