నోముల అకాల మరణంతో దిగ్బ్రాంతికి గురయ్యా:కవిత

234
kavitha
- Advertisement -

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ వెంట నడిచిన గొప్ప నాయకులు నోముల నర్సింహయ్య గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఉదయం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటనే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ నోముల మృతి చెందారు.

- Advertisement -