మహిళా బిల్లు అనే అంశానికి ప్రాధాన్యత ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ విషయంలో మిగితా పార్టీలకు చిత్తశుద్ది లేదని అర్దం అవుతోందని విమర్శించారు. మహిళలకు రిజర్వేషన్ కావాలి అని అంబేడ్కర్ చెప్పారు…కానీ మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించిన తనపై బీజేపీ కిషన్ రెడ్డి విరుచుకపడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు మహిళ రిజర్వేషన్ ఇవ్వటం లో విఫలమయ్యాయన్నారు. మోడీ కి అత్యధిక మెజారిటీ ఉన్న బిల్లు ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు.
జంతర్ మంతర్ వద్ద మహిళ రిజర్వేషన్ బిల్లు పై పోరాటం చేశానని గుర్తు చేసిన కవిత…ఈవీఎంలు టాంపరింగ్ లు జరుగుతున్నాయి అని అనుమానాలు ఉన్నాయన్నారు. బీజేపీ ఎంపి అరవింద్ పై ఎన్నికల ప్రధానాధికారి కి ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు. ఎల్బీ నగర్ ఘటన అత్యంత హేయమైన చర్య అన్నారు.
రాజకీయం లో సంయమనం అవసరం అని…మైనంపల్లి హన్మంతరావు మాట్లాడిన మాటలను ఖండించాం అన్నారు. ఆయన మాటలు సరికాదని…పార్టీ దీనిపై ఆలోచన చేస్తుందన్నారు.
Also Read:ఉస్తాద్‌లో మరో హీరోయిన్!