బోనం సమర్పించిన ఎంపీ కవిత, పివీ సింధు

424
Kavitha for Lashkar Bonalu
Kavitha for Lashkar Bonalu
- Advertisement -

సికింద్రాబాద్ మహంకాళి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంధర్బంగా లష్కర్  బోనాల వేడుకల్లో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత తో పాటు ముఖ్యమంత్రి సతీమణి శోభ.. అమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. మంత్రి పద్మారావు, పీవీ సింధు కూడా  ఈ  ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి దయతో అందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని కవిత ఆకాంక్షించారు..మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనమెత్తుకుని అమ్మవారికి సమర్పించేందుకు తరలివస్తున్నారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో మహంకాళి అమ్మవారి ఆలయం వెలిగిపోతుంది. మహంకాళి ఆలయం దగ్గర భక్తుల సందడి నెలకొంది. కాగా, మహంకాళి అమ్మవారిని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కే కేశవరావు, మండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, హోంమంత్రి నాయినీ నర్సిహారెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మేయర్ బొంతురామ్మోహన్, దర్శించుకున్నారు. Bonalu

- Advertisement -