హ్యాపీ బర్త్ డే అన్నయ్యా: కేటీఆర్‌కు కవిత విషెస్

253
kavitha ktr
- Advertisement -

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేటీఆర్ సోదరి కవిత ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియచేస్తూ చిన్ననాటి ఫోటోను షేర్ చేశారు.

మనం తోబుట్టువులను కానీ, ఇరుగుపొరుగును కానీ ముందే ఎంపిక చేసుకోలేమన్నది ఓ నానుడి. కానీ నన్నో చిట్టి చెల్లెలుగా నీవు కలిగివుండడం ఎంత అదృష్టమో నేను నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా నీ పుట్టినరోజంటే నాకు చాలా సంతోషం. నీలా రాక్ స్టార్ వంటి అన్నయ్య నాకుండడం చూస్తుంటే ఎంతో గొప్పగా అనిపిస్తోంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్యా అంటూ పేర్కొన్నారు కవిత.

- Advertisement -