కవిత బెయిల్ పిటిషన్..ఈడీ,సీబీఐలకు సుప్రీం నోటీసులు

9
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. కవిత పిటిషన్‌పై విచారణ ఈ నెల 20కి వాయిదా వేసిన న్యాయస్థానం..కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులు ఈడీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. కవిత తరపును ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఈడీ కేసులో మనీష్ సిసోడిమా, సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందని గుర్తు చేశారు. కవిత ఆడబిడ్డ ఆమెకు బెయిల్ ఇవ్వాలని కోరారు.

మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం బెయిల్‌ కోసం సుప్రీంను ఆశ్రయించారు. లిక్కర్‌ పాలసీ స్కాం సిబిఐ కేసులో ఆగస్టు 5న కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. దీంతో ఆయన మరోసారి బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్‌కి బెయిల్‌ మంజూరైనా.. సిబిఐ కేసులో బెయిల్‌ రాకపోవడంతో. తీహార్‌ జైలులోనే ఉన్నారు.

ఇక ఇదే కేసులో 17 నెలల పాటు జైలు జీవితాన్ని గడిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:వారసుల కోసం తండ్రుల పోరు..కాంగ్రెస్‌లో నయా వార్!

- Advertisement -