కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

27
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 6కు వాయిదా వేసింది స్పెషల్ కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ పై తీర్పును  6కు వాయిదా వేశారు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.

లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా ఆమె రిమాండ్‌లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు కవిత. ఇక కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు వాదించగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 6కు వాయిదా వేశారు.

Also Read:కంచుకోటలో పోటీపై కాంగ్రెస్ మౌనమేలా!

- Advertisement -