రేవంత్ చెప్పే పెట్టుబడులన్నీ భోగస్: కౌశిక్ రెడ్డి

8
- Advertisement -

రేవంత్ రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులు అన్నీ బోగస్ అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కౌశిక్..రేవంత్ రెడ్డి తమ్ముడు డైరెక్టర్‌గా ఉన్న ‘స్వచ్ఛ్‌ బయో’తో ఒప్పందం పెద్ద కుంభకోణం. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

NRI లను నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్న రేవంత్ రెడ్డి.. మరి వారి దగ్గరకే ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు కౌషిక్ రెడ్డి.

గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారు అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారన్నారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అని విమర్శించారు.

Also Read:Hemant Soren: సోరెన్ చేయిపై ఖైదీ ముద్ర‌..

- Advertisement -