BRS: ఆరు గ్యారెంటీల సంగతేంటి?

5
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల సంగతేంటి అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి . గాంధీ భవన్ నుంచి రాజ్యసభ సభ్యడు అనిల్ సవాలు విసిరారు..దానిని స్వీకరించడానికి సిద్ధం అని చెప్పినా కానీ ఇవాళ మమ్మల్ని ఎక్కడకి రమ్మని చెప్పకుండా అయన ఆసుపత్రికి పోయి ఫోటో లు, వీడియో లు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

మా పంచాయతీ మీతో కాదు రేవంత్ రెడ్డితో అని తెలిపారు. కౌశిక్ రెడ్డిని డ్రగ్స్ లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు …మీ ఐజీని చెప్పమనండి ప్రెస్ మీట్ పెట్టి.. నా మీద ఎలాంటి ప్రయత్నం చేసారో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన అలాంటి ప్రయత్నమే చేశారు అన్నారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే మీ ఎమ్మెల్యే లు, ఎంపీ లును టెస్ట్ కీ ఎందుకు వస్తాలేరు చెప్పాలన్నారు.

ఆరు గ్యారింటీలు గురించి అడిగితే డైవర్ట్ చేస్తారు, రైతులుకు వంద శాతం రుణమాఫీ చేయి , రైతులకు బోనస్ ఇచ్చి పంట కొంటా అన్నావు కనీసం ఒక్క గింజ కొన్నవా చెప్పాలన్నారు. అన్యాయంగా ఇరికించి బద్నామ్ చేయాలనీ చూస్తే ఇక్కడ ఊరుకునే వారు ఎవరు లేరు…కేసీఆర్ లేకుండా మీ మీటింగ్ ఉందా చెప్పాలన్నారు.

కేసీఆర్ చరిత్ర లేకుండా చేస్తాడు అంటా రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఆయన మాటలు విని నవ్వాలా ఏడవాలా అర్ధం కావడం లేదు అన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో నిత్యం ఉంటాడు…ప్రజలు నీకు మంచి అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చిన పదినెలలు ప్రజలు చీ చీ తూ తూ అంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:KTR:ఆగిన విద్యుత్ ఛార్జీల పెంపు..బీఆర్ఎస్ విజయం

- Advertisement -