బిగ్ బాస్ 4: గంగవ్వకు మద్దతిచ్చిన కౌశల్!

417
gangavva
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. విజయవంతంగా ఐదో ఎపిసోడ్‌ను పూర్తిచేసుకున్న బిగ్ బాస్ 4..ఈ వారం ఎలిమినేషన్‌ నేపథ్యంలో అందరిలో మరింత ఆసక్తి పెంచుతోంది

ఇక ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్‌లలో గంగవ్వ పేరు మార్మోగిపోతోంది. తొలి వారం ఎలిమినేషన్‌లో గంగవ్వ ఉండటంతో ప్రేక్షకులు ఆమెకు పూర్తి మద్దతిస్తున్నారు. ఇక ఇంటి సభ్యులు కూడా గంగవ్వ యాస,భాషకు ఫిదా అయిపోయారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మద్దతు గంగవ్వకేనని తెలిపారు. టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు గంగవ్వను బిగ్ హౌస్‌లోకి తీసుకొచ్చారని వెల్లడించారు. గంగవ్వ పవర్‌ఫుల్ లేడి అని గంగవ్వ ఆర్మీ సోషల్ మీడియాలో అద్భుతంగా పనిచేస్తుందన్నారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. పల్లెటూరి నుంచి ఓ బామ్మను బిగ్ బాస్‌కి తీసుకురావడం అభినందనీయం అన్న కౌశల్…. గంగవ్వ ఖచ్చితంగా పది వారాలపైనే బిగ్ బాస్ హౌస్‌లో ఉండొచ్చని జోస్యం చెప్పారు.

https://twitter.com/gangavvafans/status/1304049665202028544
https://twitter.com/gangavaMilkuri/status/1303326709664550915
- Advertisement -