పవన్‌ ఫ్యాన్స్‌ మళ్ళీ రెచ్చగొడితే ఊరుకోను- కత్తి

222
Katti Mahesh warning to pavan fans
- Advertisement -

వరుస ప్రశ్నలతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ను  ఉక్కిరి బిక్కిరి చేసినంతపనిచేసిన ఫిల్మ్ క్రిటిక్‌ కత్తి మహేశ్‌ ఇప్పుడు కాస్త బ్రేక్‌ తీసుకోనున్నాడు. ఇప్పటికే ‘జనసేన’ పై సంధించాల్సిన ప్రశ్నలను సంధించానని, ఇక కాసేపు వేరే మూడ్‌లోకి వెళ్తున్నట్టు సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు కత్తి మహేష్‌.

అంతేకాకుండా  ఈ పోస్ట్‌ లో పవన్‌ ఫ్యాన్స్‌ కి గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ స్వల్ప విరామం పవన్‌ ఫ్యాన్స్‌ ప్రవర్తనపై మాత్రమే ఆధారపడి ఉంటుందని, తనకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఊరుకోనని స్పష్టం చేశారు.

‘పవన్‌ కళ్యాణ్‌ను బాగా ఎండగట్టాను. నా వాదాన్ని బిగ్గరగా, చాలా తేటగా వినిపించాను. ఆయనపై వేసే ప్రశ్నల జైత్ర యాత్రకు స్వల్ప విరామం ఇవ్వాలనుకుంటున్నాను. కానీ పవన్‌ అభిమానులు మళ్లీ రెచ్చగొడితే మాత్రం ఊరుకోను సుమా..!  మళ్లీ రావాలా వద్దా అనేది ఆయన అభిమానుల చేతుల్లోనే ఉంది. నేను అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాదని కూడా తెలుసు. కానీ నా ప్రశ్నలు అనేక మందిని పునరాలోచనలో పడేశాయి. నాకు కావల్సింది కూడా అదే. నేను ఇప్పుడు వేరే మూడ్‌లోకి వెళ్తున్నాను.  నాకు భంగం కలిగిస్తే మాత్రం తప్పకుండా వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్‌ జాగ్రత్త!’అని పవన్‌ అభిమానులను హెచ్చరించాడు.

మరి పవన్‌ ఫ్యాన్స్‌ కత్తి పోస్ట్‌ పై ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

- Advertisement -