ఆడియో వేడుకలో అదరగొట్టిన అఖిల్‌..!

212
Akhil's performance will be the highlight of Hello's audio launch
- Advertisement -

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున నిర్మిస్తున్న హలో మూవీ డిసెండర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘హలో’ ఆడియో వేడుక విశాఖ సాగర తీరంలో  అంగరంగవైభవంగా జరిగింది. అయితే ఈ ఆడియో వేడుకలో  అక్కినేని వారసుడు అఖిల్ తన మల్టీ టాలెంట్‌ను మరోసారి చూపించాడు.

ఇటీవల సైమా వేదికపై తన తాజా చిత్రం ‘హలో’ మూవీలోని ‘ఏవేవో కలలు కన్నా అనే పాట పాడి అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన అక్కినేని వారసుడు.. అదే పాటను వైజాగ్ సాగరతీరంలో పాడి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. ఇక ఈ ఆడియో వేడుకకు హీరో అఖిల్‌తో పాటు.. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్‌లతో పాటు నాగార్జున, అమల హాజరయ్యారు.

- Advertisement -