టాలీవుడ్‌ వీరిని భరిస్తుందా…!

265
Katrina Like to work with Prabhas and Vikram
- Advertisement -

టాలీవుడ్‌కి బాలీవుడ్ ఫివర్ పట్టుకుంది. రాజమౌళి విజువల్ వండర్ బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాడు. దీంతో తర్వాత తెలుగులో వచ్చే అగ్రహీరోల సినిమాలకు భారీ మార్కెట్ ట్రేడవుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ,ప్రభాస్,మహేష్ లాంటి స్టార్ హీరోలతో  భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు.

వీరి క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు అవసరమైతే బాలీవుడ్ అందాల తారలను తీసుకొచ్చేందుకు వెనుకాడటం లేదు నిర్మాతలు. ఇదే అదునుగా భావించిన బాలీవుడ్ భామలు తమ పారితోషికాన్ని అమాంతం పెంచేస్తున్నారు. గతంలో బాలయ్య,వెంకీ, మమ్ముట్టి వంటి హీరోలతో నటించిన బాలీవుడ్ బ్యూటీ కత్రీనా దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి సౌత్‌పై మనసు పారేసుకుంది. ఇటీవల ఓ ఫంక్షన్‌కు హాజరైన ఈ బ్యూటీ   తెలుగులో అయితే ప్రభాస్ సరసన, తమిళంలో అయితే విక్రమ్.. అంటూ దక్షిణాదిన తన ఛాయిస్ లను చెప్పేసింది. మలయాళంలో మమ్ముట్టీ సరసన ఒక సినిమా, తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాలను చేసింది. అయితే అప్పట్లోనే ఈమెకు దక్షిణాది చిత్రపరిశ్రమ భారీ పారితోషకం ఇచ్చింది.

Katrina Like to work with Prabhas and Vikram

ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత  ఖైదీ నెంబర్ 150తో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ అదిరిపోయే హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా పద్దెనిమిదవ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను ఎంచుకున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాంచరణ్ నిర్మాతగా తెరకెక్కుతోంది.

ఈ సినిమా కోసం చిరు సరసన నటించే భామల కోసం చాలాకాలంగా అన్వేషణ జరగుతోంది. అయితే, చిత్రయూనిట్ సహా నిర్మాత రాంచరణ్ మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్ వైపు మొగ్గుచూపారట. వాస్తవానికి ఖైదీ నెంబర్ 150 సినిమాలో మొదట ఐష్‌నే హీరోయిన్‌గా అనుకున్న భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో వెనక్కితగ్గారు. తాజాగా మళ్లీ ఐష్‌ వైపే చిరు అండ్ కో మొగ్గుచూపారట. అయితే, ఐష్ మాత్రం ఈ సినిమా కోసం దాదాపుగా 9 కోట్లను డిమాండ్ చేసిందట. అంతేగాదు  ప్రభాస్ సినిమాలో నటించడానికి పరిణీతి చోప్రా, దిశాపటానీలను సంప్రదించి పారితోషకం వద్ద వెనక్కు వచ్చారు.

మరి వారినే భరించలేని మనోళ్లు పది కోట్లకు పైన అడిగే కత్రినాను భరించగలరా? హీరోకి ఎంతైనా ఇస్తాం, హీరోయిన్ కి మాత్రం ఇవ్వమన్నట్టుగా వ్యవహరించే దక్షిణాదిలో మరి బాలీవుడ్ బామల ట్రెండ్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి…

- Advertisement -