పెళ్లి కూతురిగా మారిన కత్రినా కైఫ్‌…

274
Katrina Kaif turns a bride for Shah Rukh’s Zero
- Advertisement -

బాలీవుడ్ అందాల తార, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి కూతురిగా మారిపోయింది. అయితే అది రియల్ లైఫ్‎లో కాదులేండి రీల్‎లైఫ్‎లో. బాలీవుడు సూపర్ స్టార్ షారుఖ్‎ఖాన్ జీరో చిత్రంలో తాజాగా పెళ్లి కూతురు గెటప్‎లో దర్శన మిచ్చింది కత్రినా. ఈ చిత్రం ఇప్పటికే అభిమానులలో హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక వార్తను రిలీజ్ చేసి అభిమానులలో ఆసక్తిని పెంచుతుంది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో షారుఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నట్లు తెలిస్తుంది.

 Katrina Kaif turns a bride for Shah Rukh’s Zero

గౌరీ ఖాన్ నిర్మాణంలో క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జీరో చిత్రంలో షారుఖ్ సరసన అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం రోమాంటిక్ డ్రామాగా ఉంటుందట. 2012లో వచ్చిన జబ్ తక్ హై జాన్ చిత్రంలో అలరించిన ఈ కాంబో, మళ్లీ ఇప్పుడు జీరో కోసం మరోసారి జతకట్టారు. ఇందులో అనుష్క మానసిన స్థితి సరిగా లేని యువతిగా కనిపించనున్నట్లు సమాచారం. మరో హీరోయిన్ కత్రినా ఏ పాత్రలో కనిపిస్తుందో అన్న అభిమానుల ఆసక్తికి క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటికే కత్రినా ట్రెడిషనల్ లుక్‎లో ముక్కుకి ముక్కెర పెట్టుకుని సంప్రదాయ పద్దతిలో ఉన్న ఫోటోలు వచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఆనంద్.. జీరో మూవీ కోసం ఈ ఫోటో తీసారని క్యాప్షన్‎గా రాసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ప్రస్తుతం కత్రినా థగ్స్ ఆఫ్‌ హిందూస్థాన్, జీరో చిత్రాలతో బీజీ ఉంది.

- Advertisement -