బాలీవుడ్ నటి, ప్రముఖ వ్యాపారవేత్త కత్రీనా కైఫ్ తన అందం, ఫిట్నెస్ మరియు లైఫ్‌స్టైల్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కుమారుడు విహాన్‌కు జన్మనిచ్చిన తర్వాత మాతృత్వంతో తన జీవితంలో వచ్చిన మార్పులు, శారీరక మార్పుల కారణంగా సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్ మరియు బాడీ షేమింగ్‌పై ఆమె స్పందించారు. మాతృత్వం తన అందం పట్ల ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందని వెల్లడించారు.
ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన కత్రీనా, మోడలింగ్ మరియు సినీ కెరీర్ ప్రారంభంలో అందంపై కొన్ని మూసధోరణులు (Stereotypes) ఉండేవని గుర్తు చేసుకున్నారు. “బాహ్యరూపాన్ని బట్టి అందాన్ని కొలిచే రోజులు పోయాయి. ఇప్పుడు నాకు ‘బాగా కనిపించడం’ అంటే నా శరీరానికి అంతర్గతంగా ‘బాగా అనిపించడమే’. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ ఆత్మవిశ్వాసం మన ముఖంలో సహజంగానే ప్రతిబింబిస్తుంది.
షూటింగ్‌ల కోసం చేసే మేకప్‌ల కంటే కూడా మన శరీరానికి అవసరమైన విశ్రాంతి, సమతుల్యాహారం మరియు అంతర్గత ఆరోగ్యమే అసలైన గ్లో ఇస్తాయని ఆమె స్పష్టం చేశారు. ప్రసవం తర్వాత తన చర్మం మరింత సున్నితంగా మారిందని కత్రీనా వెల్లడించారు. ఉదయాన్నే నిద్రలేవగానే ఫోన్ చూడకుండా ఉండటం, సహజమైన ఎండలో గడపడం, మెడిటేషన్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ (ఉబ్బు/వాపు) తగ్గించే ఆహారం తీసుకోవడం వంటి చిన్న చిన్న అలవాట్లు తనలో పెద్ద మార్పు తీసుకొచ్చాయని తెలిపారు.
Also Read:ఎన్టీఆర్ ‘డ్రాగన్’..క్రేజీన్యూస్
రోజుకో కొత్త ప్రాడక్ట్ మార్చకుండా చర్మానికి తేమ అందించే సరళమైన పద్ధతులనే ఫాలో అవుతున్నట్లు చెప్పారు. కాన్పు తర్వాత కత్రీనా రూపురేఖలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినప్పుడు ఆమె నేరుగా స్పందించనప్పటికీ హృతిక్ రోషన్, అలీ జాఫర్ వంటి సహనటులు ఆమెకు మద్దతుగా నిలిచారు. మహిళలను కేవలం వారి బాహ్య రూపాన్ని బట్టి మాత్రమే అంచనా వేసే మానసిక స్థితి మారాలని వారు అభిప్రాయపడ్డారు.

