మమ్మల్ని భయపెట్టడం మీ అబ్బ తరం కూడా కాదు అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.సూర్యాపేటలో ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించారు జగదీష్ రెడ్డి.మాకు కరెంటు, నీళ్లు కావాలని తమ బాధను చెప్పుకున్నారు రైతులు.
ఈ ప్రజలు తిరుగుబాటు మొదలుపెడితే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఊర్లోకి రాలేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాను అన్నారు.అన్ని నియోజకవర్గాలు తిరిగి కరెంటు పరిస్థితి, నీళ్ల పరిస్థితి అడుగుదాం రండి వెంటనే అన్ని విద్యుత్ యూనిట్లు ప్రారంభించి.. రైతులకు 24 గంటల కరెంటు అందుబాటులోకి తేవాలి అన్నారు.
నీళ్లు కూడా వదిలి ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అన్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద నీళ్లు కిందికి పోతున్నాయి.. నీళ్లు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదు..మీకు చేతకాకపోతే మాకు అప్పగించండి, ప్రాజెక్టులకు ఏం జరిగినా మాదే బాధ్యత.. రైతులకు మేము నీళ్లు ఇస్తామని కేటీఆర్ ఈ ప్రభుత్వాన్ని కోరాడు అయినా కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదు.. ఈరోజు పంటలు ఎండిపోతున్నాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం అన్నారు.
నాగార్జున సాగర్, శ్రీశైలం నుండి చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకెళ్తుంది కళ్ల ముందు కనిపించినా రేవంత్ రెడ్డి అడ్డుకోవడం లేదు…కాంగ్రెస్ నాయకులు ప్రజల భూములు లాక్కోవడంలో బిజీగా ఉన్నారు తప్ప రైతులకు నీళ్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు…మేము ఎండిపోయిన పొలాల చుట్టూ, రైతుల చుట్టూ తిరుగుతుంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు మా ఆస్తుల చుట్టూ తిరుగుతున్నారు అని ఎద్దేవా చేశారు.
Also Read:ఎన్టీఆర్ ‘డ్రాగన్’..క్రేజీన్యూస్

