రణ్‌బీర్‌తో చేయడం కష్టం..

203
Katrina Kaif Not Working With Ranbir
- Advertisement -

కత్రినా ఇప్పుడు స్పీడ్ పెంచేసింది. ఇటీవలే అమితాబ్, ఆమిర్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌’లో స్థానం సంపాదించుకున్న కత్రినా, మరోవైపు సల్మాన్, షారుఖ్ సినిమాల్లో హీరోయిన్‌గా కన్ఫామ్ అయిపోయింది. వరుసగా ముగ్గురు ఖాన్స్‌తోనూ స్క్రీన్ షేర్ చేసేకుంటుంది ఈ అమ్మడు. దీంతో ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్ అమ్మడికి అంతగా ఆనడంలేదట. కత్రినా, రణ్‌బీర్ కపూర్ జంటగా నటించిన ‘జగ్గా.. జాసూస్’ ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమౌతుండగా రణ్‌బీర్‌ కపూర్‌తో ఇక నటించబోనని చేప్పేసింది.

Katrina Kaif Not Working With Ranbir

అయితే గతంలో వీరిద్దరూ ప్రేమించుకోవడం కలసి ఒకే ఇంట్లో సహజీవనం చేయడం. తర్వాత మనస్పర్థలు రావడంతో వీరు విడిపోవడం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఇటీవల వీరిద్దరూ కలసి ‘జగ్గా జాసూస్’ అనే చిత్రంలో నటించారు. అయితే, మళ్లీ ఏమైందోగానీ, కత్రినా ఇక అతనితో కలసి నటించనని తాజాగా చెప్పేసింది. జగ్గా జాసూస్ సినిమా ప్రమోషన్‌లో కత్రినా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.మరి ఈ బాలీవుడ్ భామ చేసిన వాక్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి..

రణ్ బీర్ తో కలసి జగ్గా జాసూస్ సినిమా ఎలా చేశానో నాకే తెలియదు. అతనితో చేయడం చాలా కష్టమనిపించింది. ఈ సినిమా షూటింగులో ఇక నాతో చేయనని తను చెప్పాడు. అందుకే నేను కూడా ఇక అతనితో కలసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇదే అతనితో నా చివరి సినిమా” అంటూ ఈ ముద్దుగుమ్మ తేల్చిచేప్పేసింది. అంతగా వీరి మద్య ఎం జరిగిందో మరి.!

- Advertisement -