ఆ లిప్‌లాక్‌ కత్రినాకు నచ్చలేదు..

191
Katrina Kaif doesn't want lip-lock images with Ranbir Kapoor on Jagga

కత్రినాకైఫ్‌- రణబీర్‌ కపూర్‌ల లవ్‌ ఎఫైర్‌ గురించి ఎప్పుడో లీక్ అయిపోయింది. ఈ లవ్‌ బర్డ్స్‌ చెట్టాపట్టాలేసుకోని తిరుగుతూ.. తెగ ఎంజాయ్‌ చేస్తున్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రేజీ లవర్స్‌ ఇప్పుడు విడిపోయారంటూ ఇటీవలే మళ్ళీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరి వ్యవహారం మళ్ళీ హాట్‌ టాపిక్‌ గా మారింది.
Katrina Kaif doesn't want lip-lock images with Ranbir Kapoor on Jagga
మరి వీరిద్దరిలో ఎవరికి ఏది తక్కువైందో తెలీదుగానీ..కత్రినా మాత్రం ఓ విషయంలో బుసలు కొడుతోందట. ఆ బుసలే అనురాగ్ కశ్యప్ ని కష్టాలపాలు చేసేలా ఉంది. ఎందుకంటే…అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న జగ్గా జాసూస్ మూవీలో రణబీర్ కపూర్ – కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇదే టైంలో వీరి మధ్య బ్రేకప్‌ రావడంతో కశ్యప్‌ తల పట్టేసుకుంటున్నాడు.

అసలు వీరిద్దరికి బ్రేకప్‌ అయితే కశ్యప్‌కి ఏంటి కష్టాలు? అంటే..ఈ సినిమాలోని ఓ పోస్టర్‌ ని రిలీజ్‌ చెయ్యడానికి ఒప్పుకోవట్లేదట కత్రినా. ఎందుకంటే రణబీర్‌-కత్రినాల లిప్‌లాక్‌ తో కూడిన ఆ పోస్టర్‌ వద్దంటూ..లిప్‌లాక్‌ మీద కస్సుబుస్సులాడుతోంది ఈ హాట్‌ బ్యూటీ. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన రాగా.. ఇప్పుడు ఆ పోస్టర్ విషయంలో హీరోయిన్-డైరెక్టర్ మధ్య వివాదం తలెత్తిందట.
Katrina Kaif doesn't want lip-lock images with Ranbir Kapoor on Jagga
అయితే కత్రినాకు రణబీర్ లిప్ లాక్ చేసే ఈ పోస్టర్ ను విడుదల చేయడానికి వీల్లేదని కత్రినా ఖరాఖండీగా తేల్చేస్తోందిట. అసలు ఈ సినిమాలో ఆ సీన్ ఉండడానికి వీల్లేదన్నది ఆమె వెర్షన్.

అయితే ఈ విషయంపై కత్రినాను కన్విన్స్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు అనురాగ్ బసు. అంతే కాదు.. ఈ కిస్సింగ్ సీన్ కి ఫ్యూచర్ ప్రమోషన్స్ కి కూడా కైఫ్‌ లింక్ పెడుతోందని టాక్. ఇదిలా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఏడాది జూలై 14న జగ్గా జాసూస్ రిలీజ్ చెయ్యాలని తెగ ట్రై చేస్తున్నారు నిర్మాతలు. అయితే ఇన్ని వివాదాలు దాటుకుని అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అనే డౌట్ చాలా మందిలో ఉందనే చెప్పాలి.