కేటీఆర్ నాకే కాదు.. ఆడ బిడ్డలందరికీ అన్న !

169
Janahitha sabha in armoor
Janahitha sabha in armoor

కేటీఆర్ నాకే కాదు, తెలంగాణ ఆడ బిడ్డలందరికీ అన్న అని ఎంపీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్‌ను కొనియాడారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఓ జనహిత ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ తో కలసి హాజరైన కవిత మాట్లాడారు. రామన్న మన అందరి కష్టాలను తీర్చుతారని అన్నారు. తనకు ఆత్మీయ సోదరుడు ఉన్నందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. మున్సిపాలిటీల అభివృద్దికి అన్న కేటీఆర్ రూ.350 కోట్లు ఇవ్వాలని కోరారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ నిలిచిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని అన్నారు. గతంలో కంటే ఈసారి టీఆర్‌ఎస్ సభ్యత్వం ఎక్కువగా నమోదైందని తెలిపారు. గతంలో 51 లక్షలు ఉంటే ఈసారి 71 లక్షలు సభ్యత్వం నమోదయిందని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ ఒక్కటే నని తెలిపారు.

ArmoJanahitha

ఇక పచ్చ పార్టీ టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తప్పా కొత్తగా ఏర్పడిన రాష్ర్టాల్లో రాజకీయ సుస్థిరత లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడేకంటే ముందు మూడు కొత్త రాష్ర్టాలు ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదని, నక్సలైట్ల రాజ్యమవుతుందని ఆంధ్రా పాలకులు చేసిన దుష్ప్రచారాన్ని సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారని అన్నారు.

సోదరి కవిత కోరికపై స్పందించిన కేటీఆర్, జిల్లా మునిసిపాలిటీలకు రూ. 350 కోట్ల నిధులను దశలవారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నూతన పరిశ్రమల స్థాపన దిశగా, పారిశ్రామికవేత్తలతో స్వయంగా మాట్లాడుతానని అన్నారు. ఎన్నారైలతో చర్చించి కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలను అందిస్తానని తెలిపారు.