అనసూయ “కథనం” మోషన్ పోస్టర్ రిలీజ్

191
- Advertisement -

సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున మరదలుగా అభిమానులను అలరించిన జబర్థస్త్ యాంకర్
అనసూయ మరోసారి వెండితెరపై మెరువనుంది. వరుస ఆఫర్లతో బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై అనేక
పాత్రలు పోషిస్తూ బిజీ అయిపోయింది. సోగ్గాడే చిన్ని నాయనలో మరదలు క్యారెక్టర్‌ చేసిన అనసూయ
“క్షణం” సినిమాలో ఏసీపీ జయగా పవర్‌ఫుల్‌గా నటించింది. అనంతరం “రంగస్థలం”లో రంగమ్మత్త పాత్రలో
ఇట్టే ఒదిగిపోయింది.

ఇక తాజాగా “కథనం” అనే మూవీలో మరో పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. ది మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ లో గాయత్రి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. విజయదశమిని పురస్కరించుకుని ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

సునీల్ కశ్యప్ “కథనం”కు సంగీతం వహిస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల, ధన్‌రాజ్, వెన్నెల కిషోర్,
తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాంకరింగ్‌తో పాటు వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం
చేసుకుంటూ విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న రంగమ్మత్త ఈ చిత్రంతో ప్రేక్షకులను ఎంతవరకు
ఆకట్టుకుట్టుందో చూడాలి.

https://www.youtube.com/watch?time_continue=5&v=wamK9sXALw0

- Advertisement -