హీరో నిఖిల్ “శ్వాస” ఫస్ట్ లుక్‌

254
- Advertisement -

యువ హీరో నిఖిల్, నివేదా థామస్ జంటగా నటిస్తున్నచిత్రం “శ్వాస”. కిషన్ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయదశమిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తేజ్‌ ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి సంయుక్తంగా చిత్రానికి నిర్మిస్తున్న ఈ శ్వాస చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ ను సోషల్ మీడియా ద్వారా మూవీ
యూనిట్ వెల్లడించారు.

నిఖిల్, నివేదా ఓ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్నట్టు పోస్టర్‌లో కన్పించారు. నిఖిల్‌ ఆకాశం వైపు లార్చ్‌లైట్‌ను చూపిస్తున్నట్టుగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం నిఖిల్ “ముద్ర” అనే మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి నిఖిల్‌తో జత కడుతోంది. 2016లో వచ్చిన “కణిథన్‌” అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్ అవుతోంది. తేజ్‌ ఉప్పలపాటి, హరినికేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నాడు. ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో విజయదశమిని పురస్కరించుకుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -