కాటమరాయుడు వెబ్ సైట్ క్రాష్‌..

180
Katamarayudu Website crashed
- Advertisement -

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఓ పవర్ హౌజ్ అనే విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. పవన్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పండగే. ఇక సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. ఇక పవన్‌ తాజా మూవీ కాటమరాయుడు ఫీవర్‌తో సోషల్ మీడియాలో తారకమంత్రంగా మారింది. కాటమరాయుడికి సంబంధించి చిన్న వార్తైన నెట్టింట్లో తెగ ట్రెండవుతోంది.

మార్చి 24న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల అవనుంది. ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ సరికొత్త పంథాను ఎంచుకుంది. పవన్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని భావించిన మేకర్స్ ..ఆన్ లైన్ , ఆఫ్ లైన్ లో పవన్ సినిమాలో ధరించిన టీషర్ట్స్, టవల్స్ ని విక్రయంచే వెసులు బాటు కల్పించారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఎకోరా అనే సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకోగా, ఈ దుస్తులు ఎకోరా డీలర్ల వద్ద, ‘కాటమరాయడు’ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల వద్ద అందుబాటులోకి రానున్నాయి.

ఇక ఆన్‌లైన్‌లో వీటిని కొనుగోలు చేయాలనుకునేవారు KATAMARAYUDUSTORE.COM వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇంకేముంది కాటమరాయుడు టీ షర్ట్స్‌ దక్కించుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఒకేసారి లక్షల సంఖ్యలో వెబ్ సైట్ లోకి ఎంటరయ్యారు. హెవీ ట్రాఫిక్‌తో KATAMARAYUDUSTORE.COM హ్యాకైంది. దీంతో పవర్ స్టార్ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి బహిర్గతం అయింది. ఇక ఇవాళ సాయంత్రం కాటమరాయుడు ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.

- Advertisement -