కోలీవుడ్ లో అమీకి మరో చాన్స్‌…

215
- Advertisement -

బ్రిటీష్‌ బ్యూటి అమీ జాక్సన్‌.. తన అందాలతో పేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.అమీ కోలీవుడ్,బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం 2.0 మూవీతో స్టార్‌ ఇమేజ్‌ సోంతం చేసుకుంది. ఇప్పుడు అమీ మెగా ఆఫర్లు అందుకుంటు తన స్పీడ్‌ పెంచనుందాట.మరి అమీ రీసెంట్‌గా రజినీకాంత్‌ 2.0 మూవీలో నటించిన సంగతీ తెలిసందే.ఈ మూవీతో అమ్మడు మంచి జోరు మీద ఉందని చెప్పాలి.

2.0 చిత్రం పూర్తి చేసుకున్న అమీకి క్రేజీ ఆఫర్స్‌ వస్తున్నాయాట. కోలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడికి ఆఫర్స్‌ క్యూ కడుతున్నాయి. కేవలం అందాలు అరబోసే పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడానికి తన ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందాట. మరి ఈ చిన్నది తాజాగా కోలీవుడ్‌లో మరో చిత్రనికి డేట్‌ ఇచ్చేసిందట.

Vijay Sethupathi with Amy Jackson New Movie

అమీ చేయబోయే ఈ చిత్రానికి హీరో మరెవరో కాదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్‌ తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలోనే అమీజాక్సన్‌ హీరోయిన్‌గా ఎంపిక అయింది. ఈ చిత్రానికి దర్శకునిగా గోకుల్ వ్యవహరిస్తున్నాడు‌. ‘ఆసైపట్టై బాలకుమారా 2’ అనే ఈ చిత్రనికి విజయ్‌ సేతుపతి ఓకే చెప్పేశాడు. ఈ చిత్రంలో అమీ పాత్రకి గ్లామర్‌తో పాటు నటనకు కూడా ప్రాధాన్యం ఉండటంతో ఈ ఆఫర్‌ని ఓకే చేసిందాట.అమీజాక్సన్‌ తన అందాలే కాదు నటన ప్రాధాన్యం ఉన్న క్యరెక్టర్స్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తు తన కెరీర్‌ని ప్లాన్‌ చేసుకుంటుంది.

- Advertisement -