కాటమరాయుడు …వాలెంటైన్స్ డే స్పెషల్

198
katamarayudu valentines day special
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు. పక్కా మాస్‌ లుక్‌లో ఫ్యాక్షనిస్ట్‌గా కనిపిస్తు చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌‌, మూవీ  మోషన్ పోస్టర్‌ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో యూ ట్యూబ్‌ని షేక్ చేశాడు కాటమరాయుడు. పవన్‌ ఫీవర్‌తో సోషల్  మీడియాలో కాటమరాయుడు ట్రైలర్ రికార్డులను తిరగరాసింది. ఇక తాజాగా వాలెంటైన్స్ డే స్పెషల్‌గా చిత్ర యూనిట్‌ ఓ ఫోటోను విడుదల చేసింది.

ఈ ఫోటోలో శృతితో కలిసి ఉన్న పవన్‌ ….రొమాంటిక్‌ ఫిలింగ్‌తో అదరగొట్టాడు. ఇప్పటివరకు పవన్‌కు ఫ్యాక్షనిస్టుగా చూపించిన చిత్ర యూనిట్‌ కా టమరాయుడిలోని రొమాంటిక్‌ యాంగిల్‌ను చూపించే ప్రయత్నం చేసింది. ఈ ఫోటోలో పవన్‌ని చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. బైక్‌ పై చేతులు పెట్టి శృతితో మాట్లాడుతున్నట్లుగా ఉండే ఈ ఫోటో ప్రేమికుల రోజు కానుకగా విడుదల కాగా సోషల్ మీడియాలో వైరలైంది. కాటమరాయుడా మజాకా అంటూ అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తు  పవన్‌ ఫోటోను షేర్ చేస్తున్నారు.

డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల చేసిన కొద్దిగంటల్లోనే 50 లక్షల వ్యూస్ సంపాదించి టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 మూడు గంటల 5 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ సంపాదించగా కాటమరాయుడు కేవలం 2 గంటల్లోనే పది లక్షల వ్యూస్ సంపాదించింది. ఇక సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి టీజర్ రికార్డును కూడా కాటమరాయుడు కుమ్మేశాడు. కబాలి టీజర్ కు 2 మిలియన్ల వ్యూస్ ను అందుకునేందుకు 8 గంటల సమయం పట్టగా.. కాటమరాయుడు మాత్ర కేవలం 5 గంటల 23 నిమిషాల్లోనే ఈ ఫీట్ సాధించేశాడు.

- Advertisement -