పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాటమరాయుడు ఈ శనివారం రిలీజ్ అయ్యింది. టీజర్ విడుదలైన గంటల్లోనే అరుదైన రికార్డ్ సృష్టించింది. తొలుత ఫస్ట్‌లుక్ పోస్టర్లపై సోషల్ మీడియాని ఓ కుదుపు కుదిపేసిన పవర్‌స్టార్ ఇప్పుడు టీజర్‌తో యూట్యూబ్‌ని చీల్చిచెండాడుతున్నాడు. కాటమరాయుడు టీజర్ రిలీజైన 15గంటల్లోనే 26లక్షల వ్యూస్ ను సాధించి యూట్యూబ్ ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం ఈటీజర్‌కు 2మిల్లియన్లకు పైగా వ్యూస్ లభించాయి.
అయితే టీజర్ వ్యూస్ చూసిన పవన్ అభిమానుల ఆనందాన్నికి హద్దులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాన్ కాటమరాయుడితో హిట్ కొట్టడం పక్కా అని పవన్ అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్దార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్ తర్వాత పవన్ ఈసినిమాపై ప్రత్యేకదృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఖచ్చితంగా కాటమరాయుడుతో హిట్ కొట్టి ఫ్యాన్స్‌లో ఉత్సహ పరచాలని పవర్ స్టార్ భావిస్తున్నాడట. గబ్బర్‌సింగ్‌లో పవన్ సరసన హీరోయిన్‌గా నటించిన శృతిహాసన్ ఈ సినిమాలో కూడా పవన్‌తో ఆడిపాడబోతోంది. పవన్,శృత్రి హాసన్‌ల కెమిస్ట్రీ బాగా వర్కంట్ అవడం ఈసినిమాకు కలిసొచ్చే అంశం.
చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా కత్తి సినిమాకు రీమేక్‌గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ధృవ సినిమా కూడా తమిళంలోని తనైఒరువన్ సినిమాకు రీమేక్. ఇది కూడా తెలుగులో ఘన విజయం సాధించింది. పవన్ కాటమరాయుడు సినిమా కూడా అజిత్ హీరోగా నటించిన వీరమ్ సినిమాకు రీమేక్. దీంతో పవన్ విషయంలో కూడా ఈ రీమేక్ సెంటిమెంట్ కలొసొస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వను…సెట్ చేస్తాను అని పవన్ చెప్పిన డైలగ్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.