జబర్దస్త్‌ షో బ్యాన్‌…!

317
- Advertisement -

బుల్లితెరపై కామెడీ అంటే ఎంటో చూపించే షో జబర్దస్త్‌ ,… రియాల్టీషో, గేమ్, డాన్స్‌షోలకు దక్కని పాపులరాటీ జబర్దస్త్‌కు దక్కింది. ప్రతి గురు,శుక్రవారల్లో ప్రసారమయ్యే ఈ షోకు చాలా మంది అభిమానులున్నారు. షో ప్రసారమయ్యే సమయానికి అందరూ టీవీలముందు కూర్చుని జబర్దస్త్‌ చూస్తు అనందపడిపోతారు. జబర్దస్త్‌లో వచ్చే పంచ్‌లు కామెడీ సీన్లు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయి.

 jabardasth show ban

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ,రష్మీలు వేసుకునే పొట్టి పొట్టి డ్రెస్‌లుపై చాలా కామెంట్ల్‌ వస్తుంటాయి. షోలో వచ్చిరాని తెలుగుతో యాంకర్‌ రష్మీ ప్రొగ్రాం కంటీన్యూ చేస్తుంది. షో పుణ్యమా అని వీళ్లకు సినిమా ఆఫర్లు కూడా వరసపెట్టి మరి వస్తున్నాయి. వీరిద్దరు ఈషోలో ఎక్స్‌పోజింగ్‌ కూడా ఎక్కువగా చేస్తారని నెటిజన్లు కామెంట్లు కూడా విసురుతున్నారు. ఈషోలో మొదటి నుంచి కంటీన్యూ అవుతున్న ఆర్టిస్టులు ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ ప్లాట్‌ కారు కూడా కొనుకున్నారు. జబర్దస్త్‌ లేకుంటే మేము ఈ స్థాయిలో ఉండే వాళ్లం కాదని కొంత మంది జబర్దస్త్‌ ఆర్టిస్టులు పలు సందర్భల్లో చెబుతూంటారు. ఇండస్ట్రీ చుట్టూ తిరిగే టైంలో మా ట్యాలెంట్‌ నిరుపించుకోవడానికి జబర్దస్త్‌షో ఒక వేదికైందని ఆర్టిస్టులు అంటూ ఉంటారు.

rashmi

అయితే జబర్దస్త్‌ షోపై పలుసార్లు విమర్శలు కూడా వచ్చాయి. షోలో ఆడవారిని కించపరిచే సీన్లు వాళ్ల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని కొంతమంది అప్పట్లో కంప్లైట్‌ కూడా ఇచ్చారు. అస్తమానం అదే పనిగా స్త్రీని పసిగట్టుకుని మరీ తిట్టడం జబర్దస్త్‌ ఒక వేదికగా మారిందని పలువురు మహిళలు అభిప్రాయ వ్యక్తం చేశారు. గౌడ కులస్థలను అవమానించారని టీం లీడర్‌ వేణుపై దాడి కూడా జరిగింది. అప్పుడప్పుడు ఈషోలో పలు వివాదాల్లో కూడా ఇరుకుంది.

 jabardasth show ban

ఇటీవలే జబర్దస్త్‌ షో పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారట. ఈ షోలో కామెడీ వెకిలీగా ఉంటుందని.. ఆడవారిని, పలు వృత్తులను కించపరిచే విధంగా ఉంటుందని కేసు నమోదు అయ్యిందట. దీంతో ఈషోపై కేసుని పోలీసులు కేంద్ర ప్రసారల శాఖకి బదిలీ చేశారట…. వారు ఈషో ప్రసారాన్ని నిలిపి వేయ్యాలనే నిర్ణయం తీసుకొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈషో నిర్మాత ఐన మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్‌ వారు డిసెంబర్‌ వరకూ ప్రసారం చేసి అనంతరం నిలిపివేయ్యాలని భావిస్తున్నారట. జబర్దస్త్ షో అభిమానులకు ఇది చెదు వార్త… అనుకోవచ్చు. ఇప్పటికే ఈషోపై పలు వివాదాలు ఉన్నాయి.

- Advertisement -