కాటమరాయుడు:రివ్యూ

223
Katamarayudu Movie Review,
- Advertisement -

సర్దార్‌గబ్బర్‌ సింగ్‌ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆ లోటు భర్తీ చేసేందుకు ఈ సారిఅన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుని ‘కాటమరాయుడు’తో మళ్లీ వచ్చాడు పవన్‌కల్యాణ్‌. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వీరమ్‌’కి ఇది రీమేక్‌. అయినా పవన్‌ శైలికి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని  మార్పులు చేసింది చిత్ర యూనిట్. అసలు సినిమా కథేంటి, హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా తేడా కొట్టిందా…అనే విషయాలు  తెలియాలంటే రివ్యూ చదవండి…

కథ:

కాటమరాయుడు(పవన్‌ కల్యాణ్‌)కి నలుగురు తమ్ముళ్లు (శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు). కాటమరాయుడు ఆ వూరికి పెద్ద. ధనవంతులైన దుర్మార్గుల కొమ్ములు విరిచి, పేదవాళ్లకు పెట్టాలన్న తాపత్రయం ఉన్నవాడు. తమ్ముళ్లంటే ప్రాణం. వాళ్ల కోసం ఏమైనా చేస్తాడు. కానీ… అమ్మాయిలంటే పడదు. తమ్మూళ్లకీ అంతే. అన్నయ్య మాట వేదం… అమ్మాయిలకు దూరం. ఇలాంటి కాటమరాయుడి జీవితంలోకి  అవంతిక (శ్రుతిహాసన్‌)లాంటి అందమైన అమ్మాయి ప్రవేశిస్తే ఏమవుతుంది? కాటమరాయుడుకీ ఆ వూర్లోని నర్సప్ప (రావు రమేష్‌)కీ ఉన్న వైరం  ఏమిటి? ఈ విషయాలు తెలియాలంటే ‘కాటమరాయుడు’ సినిమా చూడాల్సిందే.

Pawan-Kalyan-Katamarayudu-preview-and-Day-1-expectations

ప్లస్ పాయింట్స్‌:

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వీరమ్‌’కి రీమేక్‌ ఇది. దర్శకుడు వీరమ్‌ కథని దాదాపు ఫాలో అయిపోయాడు. కొత్త మలుపులు, కొత్త  క్యారెక్టరైజేషన్‌ల జోలికి వెళ్లలేదు. కాకపోతే పవన్‌కల్యాణ్‌ పాత్రపై ప్రత్యేక దృష్టి నిలిపాడు. ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే  తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. గబ్బర్ సింగ్‌ సినిమా తరువాత మరోసారి జోడి కట్టిన పవన్, శృతిల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఓ  హీరో పూర్తి స్థాయిలో పంచెకట్టుతో కనిపించడం ఈమధ్య కాలంలో మనం చూళ్లేదు. పవన్‌ గెటప్‌ విషయంలో చిత్రబృందం చాలా కసరత్తులే చేసింది.  ఆయన దుస్తులు, మెళ్లొ రుద్రాక్ష, చేతికి వాచీ… ఇలా ప్రతీ అంశంలోనూ కొత్తదనం కనిపించేలా జాగ్రత్తపడింది. మరీ ముఖ్యంగా పోరాట ఘట్టాల్ని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేసింది.

శ్రుతిహాసన్‌ అందంగా కనిపించింది. పాత్ర పరిధి మేరకు రాణించింది. ఇక విలన్లుగా తరుణ్‌ అరోరా, రావురమేష్‌లు చేశారు. రావు రమేష్‌ చేసిన పాత్రల్లో  నర్సప్ప పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోతుంది. రావు రమష్ చెప్పే డైలాగులు అదిరిపోయాయి. రావు రమేష్, పవన్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా  సినిమాకు బాగా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. అలీ, నాజర్‌, పృథ్వీ వీళ్లంతా ఓకే అనిపిస్తారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ACS_4605

మైనస్ పాయింట్స్:
హీరోయిజం, ఎమోషన్స్‌ సమపాళ్లలో మేళవించిన కథ కావడంతో సెకండాఫ్‌ కాస్త నిదానంగా సాగుతుంది. పాటల్లో డ్యాన్స్‌ల విషయంలో పవన్‌ మరింత దృష్టి పెడితే బాగుండేది. తమ్ముళ్లు నలుగురు ఉన్నా… అజయ్‌, శివబాలాజీల పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం కన్పించింది. తరుణ్‌ అరోరా పాత్ర గంభీరంగా సాగినప్పటికీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేదు.

సాంకేతిక విభాగం:
వీర‌మ్ క‌థ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌ను జోడించి అభిమానుల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో వినిపించే నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అన్పిస్తుంది. ప్రసాద్‌ మూరెళ్ల తన కెమెరాతో సినిమాకు వన్నె తెచ్చాడు. ఆయన ఎంచుకున్న కలర్‌ కాంబినేషన్స్‌, పల్లెటూరి అందాలను చూపించిన తీరు అలరిస్తుంది.

తీర్పు:
దర్శకుడు తమిళ ఒరిజనల్ వీరమ్‌ను పూర్తిగా ఫాలో అయినప్పటికీ పవన్‌కల్యాణ్‌ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. క్లైమాక్స్‌లో అన్నదమ్ముల మధ్య  వచ్చే ఎమోషన్‌ సీన్లు అలరించాయనడంలో సందేహం లేదు. మొత్తం మీద ‘కాటమరాయుడు’ అభిమానులకు మంచి వినోదాన్ని అందిచడంలో సక్సెస్‌ అయ్యాడు.

విడుదల తేదీ:24/03/2017
రేటింగ్‌: 3.25/5
నటీనటులు: పవన్‌ కళ్యాణ్,శృతి హాసన్‌
సంగీతం: అనుప్‌ రుబెన్స్
నిర్మాత: శరత్‌ మారార్‌
ద‌ర్శ‌క‌త్వం: డాలీ

- Advertisement -