జయలలిత మరణం తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ పొలిటికల్ ఎంట్రీ వార్తలు తమిళనాట ఇప్పుడు హాట్ టాప్ గా మారాయి. గత కొద్ది రోజులుగా రజనీ రాజకీయాల్లోకి రావాలని.. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే క్రమంలో తమిళ తలైవా రాజకీయ రంగ ప్రవేశంపై గత కొన్ని రోజులుగా తీవ్రమైన చర్చ జరగుతోంది. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? లేదా అనే అంశం గురించి ఆయన అభిమానులతోపాటు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.
అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అంటూ అటు ఫ్యాన్స్‌తో పాటు, జాతీయ మీడియా నుంచి ఇటు తమిళనాడు, ఇతర ప్రాంతీయ మీడియా వర్గాల వరకూ ఇదే పెద్ద చర్చనీయాంశం. ఇప్పటి వరకూ ఈ అంశంపై విపరీతమైన చర్చ జరిగింది, జరుగుతోంది, జరుగుతూనే ఉంది.
కానీ రజనీ ఇంత వరకూ పూర్తి స్థాయిలో స్పష్టతను ఇవ్వలేదు. పొలిటికల్ ఎంట్రీ ఖాయం అన్నట్టు రజినీ నుంచి సంకేతాలను వచ్చేసరికి.. మీడియాకు అదో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే అంశంపై కస్తూరి ఇప్పటికే ఒకటీ రెండు సార్లు స్పందించిన విషయం తెలిసిందే.
రాజకీయాల్లోకి వచ్చే అంశం గురించి రజనీకాంత్ నాన్చుడు ధోరణిని అవలభించడంపై ఆ మధ్య కస్తూరి ఘాటుగా స్పందించింది. దీంతో రజనీ అభిమానులు ఆమెపై మాటల దాడి మొదలుపెట్టారు.
కానీ తను కూడా రజనీ అభిమానినే అని, నాన్చుడు ధోరణిని మాత్రం భరించలేను అని కస్తూరి ఎదురుదాడి చేసింది. ఆ తర్వాత రజనీకాంత్ తో సమావేశమై ఆశ్చర్యపరించింది కస్తూరి. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.
మరి ఇదే అంశం గురించి ఆమె దగ్గర వివరణ అడిగితే మాత్రం తీవ్రంగా స్పందించింది. రజనీ రాజకీయాల్లోకి వస్తారా? ఆయనతో పాటు మీరు కూడా వస్తారా? అనే ప్రశ్నపై కస్తూరి ఘాటుగా స్పందించింది.
అంతకు మించి వేరే సమస్య లేదా? అని కస్తూరి ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఎంతసేపూ రజనీనే పట్టుకుని వేలాడొద్దని, తమిళనాడులో మాట్లాడుకోవడానికి అంతకు మించిన సమస్యలు చాలానే ఉన్నాయని వాటి గురించి మాట్లాడాలని కస్తూరి మీడియాకు హితబోధ చేసింది.