ఈ కషాయం తాగితే.. ఆ రోగాలు మాయం!

98
- Advertisement -

 చలికాలంలో జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా కీళ్ల నొప్పులు, కండరాల వాపు వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. అయితే ఇలాంటి సర్వసాధారణ సమస్యలకు మెడిసన్ తీసుకోవడం మంచిదే అయినప్పటికి.. ఇంటి చిట్కాల ద్వారా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే అల్లం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. అల్లం వంటల్లో రుచిని పెంచడంతో పాటు మన శరీరానికి అవసరం అయ్యే ఎన్నో పోషకాలను కూడా అందిస్తుంది. అంతే కాకుండా అల్లం ఎన్నో ఔషధ గుణాలను కూడా కల్గి ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ వైరల్ వంటి లక్షణాలను కల్గి ఉండడంతో పాటు రోగనిరోదక శక్తిని కూడా పెంచుతుంది అల్లం. అలాగే మెటబాలిజంను పెంచడంలో కూడా అల్లం ఎంతొగానో ఉపయోగ పడుతుంది. అందువల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్న అల్లన్ని ప్రతిరోజూ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే అల్లన్ని వంటల ద్వారా సేవించడం కంటే నేరుగా పచ్చి అల్లాన్ని రసంలా చేసుకొని లేదా కషాయంలా తయారు చేసుకొని సేవించడం ఎంతో మంచిదని చెబుతున్నారు నిపుణులు. కాగా అల్లాన్ని కషాయంలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం !

ముందుగా రెండు పెద్ద సైజు అల్లం ముక్కలను తీసుకొని బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో 200ఎం‌ఎల్ నుంచి 500ఎం‌ఎల్ వరకు మంచి నీటిని పోసి ఆ గిన్నెను స్టవ్ పై ఉంచి నీటిని మరిగించాలి. నీరు బాగా మరిగిన తరువాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను అందులో వేసి ముక్కలు నీటిలో కలిసేంత వరకు మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని వడగట్టుకొని గోరు వేచ్చగ ఉన్నప్పుడూ తాగలి. అయితే ఈ కషయాన్ని రోజు ఉదయాన్నే పడగడుపున సేవిస్త్గే మరిన్ని ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ కషాయంలోకి కొద్దిగా తేనె, నిమ్మరసం వంటివి కూడ యాడ్ చేస్తే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయట. ఇలా అల్లం కషయాన్ని ప్రతిరోజూ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. అలాగే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడంతో పాటు స్త్రీలలో నెలసరి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా అల్లం కషాయం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందట. అందువల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనలు ఉన్న అల్లం కషయాన్ని ప్రతిరోజూ సేవిస్తే ఎంతో మంచిది.

Also Read: టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించాం!

- Advertisement -