గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కాసర్ల శ్యామ్‌..

54
kasarla shyam

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లోని తన నివాసంలో మొక్కలు నాటారు సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్. అనంతరం మాట్లాడుతూ మంచి రోజు తో పాటు నూతన గృహ ప్రవేశం చేసిన రోజే నేను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటానని ” రాములో రాముల పాట ” ఫెమ్ సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్ అన్నారు.

పచ్చని చెట్లే ప్రగతికి మెట్ల అనే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి నేటి వరకు లక్షల మొక్కలు నాటే విధంగా ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మిమిక్రి కళాకారులు శివారెడ్డి , సంగీత దర్శకురాలు ఎం.ఎం శ్రీలేఖ ఇద్దరు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన నివాసంలో మొక్కలు నాటారు.

అనంతరం మరో ముగ్గురు సంగీత దర్శకులు అయినటువంటి ( జీవన్ బాబు , మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ , భీమ్స్ సిసిరోలియో ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.