టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని…

203
chandrababu
- Advertisement -

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ టీడీపీలో చేరారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు జ్ఞానేశ్వర్. ముదిరాజ్ మహాసభ అధ్యక్షులుగా ఉన్న కాసాని… 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

గతంలో ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్‌గా పనిచేశారు. కొద్దిరోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. మంత్రి హరీష్‌రావుతో కూడా చర్చించినట్లు ఊహాగానాలు వినిపించాయి. అలాగే ఈటల రాజేందర్‌ని కూడా కలిశారు. దీంతో బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగగా ఎవరూ ఊహించని విధంగా టీడీపీలో చేరారు.

- Advertisement -